ఇంట్లో వుండే.. ఇలా సింపుల్ గా పాన్ కార్డుని పొందవచ్చు..!

-

పాన్ కార్డు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది బ్యాంకుకు వెళ్ళేటప్పుడు ముందు పాన్ కార్డు చాలా అవసరం అవుతుంది ట్రాన్సాక్షన్స్ లేదంటే ఏదైనా ఆర్థిక పని పూర్తి కావాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. కేవలం 9 నిమిషాల్లో ఇంట్లోనే జనరేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగానే ఎలాంటి డబ్బు పే చేయక్కర్లేదు. కస్టమర్ పాన్ కార్డు నెంబర్ కూడా తక్షణమే పొందవచ్చు పాన్ కార్డు నెంబర్ ని ఆదాయపు పన్ను శాఖ జారీచేస్తుంది ఆధార్ కార్డ్ ఆధారంగా టాక్స్ కట్టే వాళ్ళకి ఈ పాన్ జారీ చేయబడుతుంది.

pancard

ఆధార్, పేరు, పుట్టిన తేదీ అలానే మరికొన్ని వివరాలతో సులభంగా పాన్ కార్డు పొందొచ్చు అది కూడా తక్కువ సమయంలోనే. ఉచితంగానే. ఈ పాన్ మరియు ఆధార్ సమాచారం తప్పనిసరిగా సరిపోవాలి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ని కూడా ఇవ్వాలి. ఓటిపీని ఎంటర్ చేయాలి. దీనికోసం ముందు మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇన్స్టంట్ ఈ పాన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

ఇక్కడ ఈ పాన్ వర్తించు పై క్లిక్ చేయండి. తర్వాత ఫామ్ ని ఫిల్ చేయండి తప్పులు ఏమీ లేకుండా ఫార్మ్ ని ఫిల్ చేయండి ఇప్పుడు మీకు ఓటిపి వస్తుంది దానిని ఎంటర్ చేసేయండి ఆధార్ తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది. భవిష్యత్తు కోసం దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఈ ఫైలింగ్ పోర్టల్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. డ్యాష్ బోర్డులో సేవలు మీద క్లిక్ చేయండి తర్వాత వీక్షణ లేదంటే ఈ పాన్ డౌన్లోడ్ క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి. కొనసాగించు మీద క్లిక్ చేసి ఓటిపిని ఇచ్చేసి స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ పాన్ డౌన్లోడ్ ఎంపిక మీద క్లిక్ చేస్తే పాన్ కాపీని డౌన్లోడ్ చేయడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news