ఆ రోజు రావాలని ఆశపడుతున్నా – పవన్ కళ్యాణ్

-

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మహిళలందరికీ రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని అన్నారు. ” కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక. ఈ పర్వదినం సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన అక్క చెల్లెలు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.

ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకున్న మనం.. మన కళ్ళ ఎదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వంలోని పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే మన ఆడబిడ్డల గతి ఏంటి..? వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినే వారు ఎవరు..? ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్. ఆరోజు రావాలని ఆశ పడుతున్నా” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news