డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రోజువారీ లావాదేవీలను ఈజీగా మార్చడానికి సరికొత్త కార్డును ప్రారంభించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..యూజర్ల కోసం సరికొత్త ట్రాన్సిట్ కార్డును లాంచ్ చేసింది.
దీనిని రోజువారీ అవసరాలకు అనుగుణంగా వాడచ్చు. ఈ కార్డు మెట్రో, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ బస్సు సర్వీసులు, మర్చెంట్ స్టోర్లలో, టోల్ పార్కింగ్ ఛార్జీలు, ఆన్లైన్ షాపింగ్ వంటి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. అలానే ఏటీఎం నుంచి డబ్బు కూడా విత్‌డ్రా చెయ్యచ్చు.
బ్యాంకింగ్ లావాదేవీలను ఈజీ చెయ్యడానికి ఈ ట్రాన్సిట్ కార్డును స్టార్ట్ చేసారు. పేటీఎం వ్యాలెట్‌తో ఈ ట్రాన్సిట్ కార్డుతో లింక్ చేసుంటుంది. వినియోగదారులు ఇకపై అన్ని రకాల కార్డ్‌లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ తో పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తద్వారా ట్రాన్సిట్ కార్డుతో నేరుగా మెట్రో ఛార్జీలను చెల్లించవచ్చు. ఈ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ నినాదంతోనే కొత్త కార్డును తీసుకొచ్చింది. మెట్రో, బస్సు, రైలు సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించే 50 లక్షలకు పైగా రైడర్లకు ఈ ట్రాన్సిట్ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. పేటీఎం యాప్ ద్వారా ట్రాన్సిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పేటీఎం సేల్స్ పాయింట్ల నుంచి కూడా దీనిని పొందొచ్చు. ఈ కార్డును నేరుగా పేటీఎం వాలెట్‌కి లింక్ చేయవచ్చు.