హైద‌రాబాద్ లో దారుణం…భార్య‌పై భర్త బ్లేడ్ తో దాడి..!

కొన్నిసార్లు చిన్న చిన్న వివాదాలే భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర‌ప‌రిణామాల‌కు దారి తీస్తాయి. దాడులు హ‌త్య‌ల వ‌ర‌కూ వెళ‌తాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య పై భ‌ర్త స‌య్య‌ద్ మాజీద్ బ్లేడ్ తో దాడి చేశాడు. దాంతో భార్య సమీరా బేగమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విష‌యం స్థానికుల‌కు తెలియ‌డంతో హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే బ్లేడు దాడిలో తీవ్ర‌గాయాలు అవ్వ‌డంతో ప్ర‌స్తుతం స‌మీరా భేగం పరిస్థితి విషమంగా ఉంది.

స‌మీరా కుటుంభ స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా నిన్న రాత్రి భార్యాభర్తల మద్య నెల కొన్న చిన్న పాటి వివాదంతో మాటా మాటా పెరిగి ఇద్దరి మద్య ఘర్షణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దాంతో ఒక్కసారిగా భ‌ర్త స‌య్య‌ద్ త‌న భార్య‌పై బ్లేడ్ తో దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది.