నాటి హీరోయిన్ల డిమాండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

-

నాటితరం హీరోయిన్లు అనగానే ముందుగా మనకు అంజలీదేవి, భానుమతి, సావిత్రి, జమున వంటి వారే ఎక్కువగా గుర్తుకొస్తారు. తమ పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే కాదు ఆ పాత్రలలో లీనమై అందరి చేత ప్రశంసలు అందుకున్న వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా గొంతెమ్మ కోరికలు ఎక్కువగా కోరుతూ ఉంటారు. కొంతమంది నటనలో బాగున్నా ఎక్స్పోజింగ్ చేయడానికి హద్దులు పెట్టుకుంటారు. మరి కొంతమంది ఎలాంటి హద్దులు పెట్టుకోకపోయినా సరే వారికి నటించడం రాదు. అన్నీ ఉన్నాయంటే ఏదో ఒక విషయంలో కచ్చితంగా వారు అదే విషయాన్ని ఫాలో అవుతూ ఉంటారు.

అప్పట్లో హీరోయిన్లు ఎంత వయసు వచ్చినా పెళ్లయి, పిల్లలు ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ గానే నటిస్తూ చలామణి అయ్యేవారు. అలా పాతికేళ్ళకు పైగా హీరోయిన్ గా ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అప్పటి దర్శకుడు కూడా ప్రోత్సాహం ఇచ్చేవారు. ఇక వారు హీరోయిన్లైనా కూడా మహిళలే కాబట్టి ఎక్కువగా పూజలు , వ్రతాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబానికి వండి పెట్టాకే షూటింగ్ కి కూడా వెళ్ళేవారు. ఇకపోతే అప్పట్లో ఎక్కువగా ఇండోర్ షూటింగ్స్ జరిగేవి. మద్రాస్ లో స్టూడియోలు కట్టి అక్కడే అనేక ఫ్లోర్స్ లో ఒకేసారి చాలా సినిమాల షూటింగులు జరిపిస్తూ ఉండేవారు.

కొంతకాలం తర్వాత సినిమాలు బయట ప్రదేశాల్లో కూడా షూట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో హీరోయిన్స్ ఇంట్లో తల్లి, భార్య, బాధ్యత నెరవేర్చాలనుకుని కొంతమంది అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్లేవారు కాదు. ముఖ్యంగా అంజలీదేవి , భానుమతి వంటి వారు ఇండోర్ అయితేనే చెప్పండి లేదంటే లేదు అంటూ మొహం మీదే చెప్పేవారట. ముఖ్యంగా పూజలు, పురస్కారాలు చేసుకొని భర్తను, ఇంటిని చూసుకుంటూ ఏదో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తే చాలు అనుకునేవారు. అవుట్డోర్ షూటింగులు ఉన్నా సరే వెళ్లకుండా దర్శకులతో పేచీ పెట్టే వారట. కథ చెప్పేటప్పుడు డిమాండ్ చేసేవారు. ఇక అలా ఉన్నారు కాబట్టే ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news