కరోనా తర్వాత చాలా మంది డబ్బులను సంపాదించాలని అనుకుంటారు..అయితే కొన్ని రకాల బిజినెస్ లలో మని ఇన్వెస్ట్ చేస్తే నెలకు వేలు సంపాదించే అవకాశం ఉందని అంటున్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ లలో ఒకటి కాఫీ షాప్ ను మొదలు పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చు..అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
స్టాల్‌లానే.. కాఫీ షాప్ ప్రారంభిస్తే.. ఆ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒక మంచి ప్రాంతంలో.. జనాలను ఆకట్టుకునే విధంగా.. షాప్‌ను ప్రారంభిస్తే.. బాగా ఆదాయం వస్తుంది. కాఫీ షాప్‌ను ప్రారంభించాలంటే మీకు.. ముందుగా కాఫీ మెషీన్ అవసరం. అయితే మార్కెట్‌లో లభించే సాధారణ కాఫీ మెషీన్‌లను తీసుకోకుండా.. అదునాతన టెక్నాలజీ ఉన్న లేటెస్ట్ మోడల్ కాఫీ మెషీన్లను తీసుకోవాలి. ఈ యంత్రం మీ కాఫీ షాప్‌ను ప్రత్యేకంగా చేస్తుంది.
ఆ కాఫీ మిషన్ పేరు ఎస్ప్రెస్సో వెండింగ్ మెషిన్. భారత మార్కెట్‌లో వీటి ధర 20 వేల రూపాయల వరకు ఉంది. మీ షాపు జనాలను ఆకర్షించి.. వ్యాపారం బాగా జరగాలంటే… కాఫీ మెషీన్‌తో పాటు మరో యంత్రాన్ని కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మెషీన్. ఈ యంత్ర సాయంతో మీరు కాఫీ పైభాగంలో మీకు నచ్చిన వారి ముఖాన్ని ప్రింటింగ్ చేయవచ్చు. అంటే కాఫీపై ఫొటో కనిపిస్తుందన్నమాట. కేవలం ఫొటోలే కాదు.. రకరకాల డిజైన్ల రూపంలో కాఫీని అందించవచ్చు.
మార్కెట్ లో ఈ కాఫీకి మంచి డిమాండ్ కూడా ఉంది.. 50 నుంచి 100 రూపాయలు అమ్మడం వల్ల రోజులు 7 నుంచి 8 వేలు పొందవచ్చు.. అలా నెలకు 2 లక్షల వరకూ పొందవచ్చు.. అన్నీ ఖర్చులు పోగా నెలకు 70 వేల వరకూ పొందవచ్చు..కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో.. ఇలాంటి కాఫీ షాప్‌ని ఏర్పాటు చేస్తే.. గిరాకీ ఎక్కువగా ఉంటుంది… మీకు ఇలాంటి ఆలోచన ఉంటే ఇది మొదలు పెట్టడం మంచిది..