చాల మంది చిన్న పిల్లల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న పిల్లలు అనేక హెయిర్ సమస్యల తో సతమతం అవుతున్నారు. అయితే హెయిర్ సమస్యలకి చెక్ పెట్టాలంటే ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఇలా చేస్తే ఎన్నో సమస్యలని క్షణాల్లో మాయం చెయ్యొచ్చు. కొంత మంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ చాల తక్కువగా ఉంటుంది, చిన్న వయసు లోనే జుట్టు ఊడే సమస్య కూడా వస్తోంది. అయితే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే… ఇంఫెక్షన్స్, జ్వరం, జీన్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ వంటివి కారణాలు అవ్వొచ్చు.
ఇక టిప్స్ విషయానికి వస్తే… జుట్టు ఒత్తుగా ఉన్నా, పల్చగా ఉన్నా, ఊడుతున్నా, ఊడకున్నా ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వడం. ఇలా చేస్తే ఎంతో సులువుగా ఏ సమస్య మీ దరి చేరనివ్వకుండా చెయ్యొచ్చు. మీ పిల్లలకి వారానికి రెండు మూడు సార్లు కెమికల్ ఫ్రీ షాంపూతో తల స్నానం చేయించండి.
అలానే స్నానం చేయించేటప్పుడు తలకి చల్ల నీరు, లేదా గోరు వెచ్చని నీరు మాత్రమే వాడండి. హెయిర్ ఆయిల్ తో జుట్టు మాయిశ్చరైజ్డ్ గా ఉండేటట్లు చూసుకోండి. అలో వెరా జెల్ తో కూడా మంచి బెనిఫిట్ ని పొందొచ్చు. లేదా కొబ్బరి నూనె లో మందార ఆకులని వేసి మరిగించి ఆయిల్ చేసి దానిని ఉపయోగించండి. ఇలా చేస్తే ఈ సమస్యల నుండి ఎంతో సులువుగా బయట పడొచ్చు.