చికిత్స పొందుతూ యువకుడి మృతి

crime

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబీకులు అతన్ని వరంగల్ ఎంజైమ్కు తరలించారు. ఆరోగ్యం కుదుట పడగా, ఈ నెల 9న వైద్యులు ఇంటికి పంపించారు. మళ్లీ అనారోగ్యంతో బాధపడుతున్నగా తిరిగి MGMలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.