లాక్ డౌన్ సమయంలో మూగ జీవాలు ఇప్పుడు తిండి లేక చాలా చోట్ల ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. మనుషులే ఆకలి తో ఇబ్బంది పడుతున్న వేళ వాటిని ఆదుకునే వారు లేకపోయారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ఒక యువకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత డబ్బులతో నోరు లేని మూగ జీవాల కోసం ఆహారం అందించాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
వీరీన్ శర్మ అనే యువకుడిది రాజస్థాన్‌లోని జైపూర్. అక్కడే అతను నివాసం ఉంటున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఎన్నో జంతువులు ఇప్పుడు ఆకలి తో బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ విషయాన్ని తన చుట్టూ ఉన్న గ్రామాల్లో అతను గమనించాడు. వాటికి ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నాడు అతను. 70 రోజుల పాటు జంతువులకు ఆహారం అందించి తన పెద్ద మనసు చాటుకున్నాడు.
ఇందుకోసం గానూ అతను సొంత డబ్బును ఖర్చు చేసి కోతులు, కుక్కలు, ఆవులు, ఇతర జంతువులకు ఆహారం ఏర్పాటు చేసాడు. పలు గ్రామాల్లో అతను ఇందుకోసం తిరిగాడు. విరెన్ శర్మ ప్రతిరోజూ శునకాల కోసం 600 ఫుడ్ ప్యాకెట్లను సిద్ధం చేయడమే కాకుండా తన స్నేహితుల సహకారంతో ఆవులకు పశుగ్రాసం, కోతులకు అరటిపండ్లు అందించి వాటికి అండగా నిలిచాడు అతను. దీనిపై పలువురు అతన్ని అభినందిస్తున్నారు.