RRR Trailer : ట్రైల‌ర్ లో young “TIGER” ఎన్టీఆర్ డామినేష‌న్

-

నంద‌మూరి, మెగ ఫ్యాన్ తో పాటు స‌గటు తెలుగు సినీ అభిమ‌ని ఎంతో ఆస‌క్తి గా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌ల అయింది. అయితే ఈ ట్రైల‌ర్ లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డామినేష‌న్ కాస్త ఎక్కువ గా నే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్ డేట్ లో కూడా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దే డామినేష‌న్ ఉండేది.

అయితే ఈ రోజు విడుద‌ల అయిన ట్రైల‌ర్ లో మాత్రం ఎన్టీఆర్ దే డామినేష‌న్ ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ట్రైల‌ర్ లో ఎన్టీఆర్ పోరాట స‌న్నివేశాలు కానీ.. ఆయ‌న డైలాగ్స్ కానీ నంద‌మూరి అభిమానుల‌ను ఎంతో అల‌రించాయి. అలాగే ట్రైల‌ర్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. టైగ‌ర్ తో పోటీ ప‌డుతున్న‌ట్టు ఉన్న సీన్ అయితే ఎన్టీఆర్ అభిమానుల కు గూస్ బంప్స్ వ‌చ్చేలా ఉన్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ సినిమా లో మెగా పవ‌ర్ స్టార్ దే హావా ఉంటుంద‌న్న వారికి కౌంట‌ర్ ఇచ్చేలా ట్రైల‌ర్ వ‌చ్చింద‌నే చెప్పాలి.

 

నిజానికి ఈ సినిమా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి హీరోల‌ ను కాకుండా.. పాత్ర ను బ‌ట్టి సినిమా తీస్తారు. ఇది మరో సారి ఈ సినిమా ద్వారా రుజువు అయింద‌నే చెప్పాలి. ఏది ఏమైనా.. ట్రైల‌ర్ తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతీ ని మ‌రోసారి దేశానికి చాటారు. ట్రైల‌రే ఇలా ఉంటే.. సినిమా ఎలా ఉంటుందో అని తెలుగు సినీ అభిమానులు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news