ఒక్క క్లిక్ తో డోర్ వద్దకే డీజిల్ అందిస్తున్న యువతి..!

-

కుటుంబంలో వారు ఏ వ్యాపారం చేస్తే.. పిల్లలకు కూడా దాదాపు వాటిమీద ఆసక్తి ఉంటుంది. కానీ కొందరు.. వేరే ఫీల్డ్స్ ను చూసుకుంటూ.. జీవితంలో సక్సస్ అవుతున్నారు. దిల్లీకి చెందిన సన్యా గోయెల్ కూడా ఇందుకు చక్కని ఉదాహరణ. నూనె వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన ఆమె.. డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేసే కొత్త ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టారు. ఆమె సక్సస్ ఫుల్ స్టోరీని ఉమెన్స్ డే సందర్భంగా మనమూ తెలుసుకుందామా..!
వ్యాపారంపై మక్కువతో వార్‌విక్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ చదివిన సన్యా.. ఇప్పుడు తన కుటుంబంలో నాలుగో తరానికి చెందిన బిజినెస్‌ ఉమన్‌. నూనె వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చినా.. ఇంధన రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంచింది.. ఈ క్రమంలోనే తన కజిన్స్‌తో కలిసి దిల్లీలో 2016లో ‘సమృద్ధి హైవే సొల్యూషన్స్‌’ అనే సంస్థను స్థాపించింది. ఇంధన డీలర్లు, రీటైలర్స్‌ భాగస్వామ్యంతో ఇంధన కొనుగోళ్లపై లాయల్టీ ప్రోగ్రామ్స్‌ నిర్వహించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.
మూడేళ్ల పాటు ఈ సేవల్ని అందించిన ఈ సంస్థ.. ఆపై ‘పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ’ డీజిల్‌ డోర్‌ డెలివరీని చట్టబద్ధం చేయడంతో తన దిశను మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే 2019లో ‘హమ్‌సఫర్‌’ పేరుతో డీజిల్‌ డోర్‌ డెలివరీ యాప్‌ను సన్యా రూపొందించింది .
యాప్ హైలెట్స్
స్థిర/భారీ మెషినరీ వద్దకే డీజిల్‌ని చేర్చడం ఈ యాప్‌ మోటో.. ‘ఏ వస్తువైనా గుమ్మం ముందుకు వచ్చేంత టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆలోచనతోనే డీజిల్‌ డోర్‌ డెలివరీ చేసేందుకు హమ్‌సఫర్‌ని రూపొందించామని ఆమె పేర్కొంది.. వినియోగదారులకు ఖర్చు తగ్గించడంతో పాటు వారి సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తారట..
ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, నిర్మాణ సముదాయాలు, హోటళ్లు, స్కూళ్లు, మాల్స్‌, తయారీ-మైనింగ్‌ సంస్థలు.. వంటి సముదాయాల దగ్గరికే పెద్ద ఎత్తున డీజిల్‌ని సప్లై చేస్తున్నారట.
వినియోగదారులు మా వద్ద కనిష్ఠంగా 100 లీటర్ల నుంచి గరిష్ఠంగా PESO నిబంధనల ప్రకారం ఎంతైనా ఆర్డర్‌ చేసుకోవచ్చు.
24X7 మా సేవలు అందుబాటులో ఉంటాయి.
దూరాన్ని బట్టి ఆర్డర్‌ చేసిన ఎనిమిది గంటల్లోపు డీజిల్‌ గుమ్మం ముందు ఉంటుందట..
ఇలా హమ్‌సఫర్‌ యాప్‌ ద్వారా డీజిల్‌ని బుక్‌ చేసుకున్న తర్వాత వినియోగదారులు లైవ్‌ లొకేషన్‌ని ఫాలో అయ్యే సౌలభ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీ అన్నీ యాప్స్ లోనూ ఉంటుందనుకోండి.. కల్తీ, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాల్ని నిరోధించడానికి వీలుగా ప్రత్యేకమైన OTP వ్యవస్థను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలోనూ నిర్విరామంగా తమ సేవల్ని కొనసాగించారట.

 

View this post on Instagram

 

A post shared by Humsafar India (@humsafarindia)

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలకు విస్తరించిన హమ్‌సఫర్‌ సేవల్ని ఇప్పటివరకు సుమారు 6,200 మందికి పైగా వినియోగదారులు ఉన్నారట. దాదాపు 7 లక్షల లీటర్ల డీజిల్‌ని డెలివరీ చేసినట్లు ఆమె తెలిపారు. భవిష్యత్తులో ఇతర దేశాల్లోనూ తమ సేవల్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారట.!
వనూత్న ఆలోచనతో అడుగు ముందుకేస్తే.. విజయం తలుపు తడుతుందని సన్యా మరోసారి నిరూపించింది. కుటుంబ వ్యాపారం ఇష్టం ఉంటే చేయొచ్చు.. కానీ మనకు ఏది చేయాలని ఉంది.. ఏ రంగానికి సెట్ అవుతామో ప్రతి మహిళకు ముందు అవగాహన ఉండాలి. కష్టమైన ఇష్టమైన పని చేయడంలో ఉండే ఆనందం అది అనుభవించే వారికే తెలుస్తుంది కదా..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news