పిల్లలు ఇయర్ ఫోన్స్ వాడుతుంటే, తల్లి తండ్రులు ఓ కన్నేసి ఉంచండి…!

-

నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి కదండి. ఇప్పుడు చెప్పే నిజం కూడా దారుణమైన చేదు. కలబంద కంటే చేదు గా ఉంటుంది మరి. ఈ రోజుల్లో అసలు ఇయర్ ఫోన్స్ లేకుండా ఏమైనా పనులు చేస్తున్నారా పిల్లలు…? తల్లి తండ్రులు కూరగాలు తీసుకురమ్మని చెప్పినా, ఏదైనా పని చెప్పినా, వాటర్ క్యాన్ కి పంపించినా, ఏదైనా షాప్ కి వెళ్లి రా రా బాబు అని చెప్పినా సరే చెవిలో కాడలు లేకుండా వెళ్ళడం లేదు. 

ఇక ఇంట్లో కూడా వాళ్ళు మీ ముందు కుర్చుని ఇయర్ ఫోన్స్ తో కనపడుతూ ఉంటారు. అప్పుడే జాగ్రత్తగా ఉండమని అంటున్నారు పరిశోధకులు. పిల్లలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నట్టు నటించడం, సోషల్ మీడియాలో ఏదో చూస్తున్నట్టు మిమ్మల్ని భ్రమలో ఉంచడం చేస్తున్నారు. కాని ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఎక్కువైపోయాయి. ప్రేమ వ్యవహారాలతో పాటుగా, ఇతర కార్యక్రమాలను కూడా ఎక్కువగానే చేస్తున్నారు.

ప్రేమించిన వారితో వీడియో కాల్స్ మాట్లాడటం లేదా వాళ్లకు మీ ఇంటి పరిసరాలు చూపించడం వంటివి చేస్తున్నారు. వాళ్ళ బుద్దులు మంచివి అయితే పర్వాలేదు. తేడా వస్తే మాత్రం మీ ఇల్లు కాళీ అవ్వడమే కాదు. ఇంకా చాలా నష్టాలు ఉన్నాయని అంటున్నారు. మీ ఇంట్లో వ్యక్తిగత విషయాలు వారు వినడం, ఆ తర్వాత మీ పిల్లలను వేధించడం, మీ ఇంట్లో వస్తువులు చూసి వాటిని తీసుకురావాలని ఒత్తిడి చేయడం వంటివి జరిగే ప్రమాదం ఉందని, అంతే కాకుండా వ్యక్తిగత విషయాలు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి పిల్లలు ఇంట్లో మీరు ఉన్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనపడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news