విశాఖ: జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరఫున సలీం అనే న్యాయవాది రెండు పిటిషన్లు వేశారు. ఇందులో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా, రెండోది శ్రీనివాసరావుకు ఆరోగ్యం బాగోలేదని, వైద్యం చేయించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై మూడు, నాలుగు రోజుల్లో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన (శనివారం) శ్రీనివాసరావును కలిశానని చెప్పారు. ముందుగా తనను కలవడానికి నిరాకరించాడని, రెండు గంటల తర్వాత కలిశాడని తనకు బెయిల్ ఎప్పుడు వస్తుందని అడిగాడని చెప్పారు.
జైల్లో ఏమైనా సదుపాయాలు కల్పించాలా అని అడగ్గా తనకేమి వద్దని జైల్లోనే ఉంటానని చెప్పాడని న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్లు తాను సొంతంగానే వేశానన్నారు. శ్రీనివాసరావు బెయిల్‌పై వస్తే ఆయన చెప్పదలచుకున్న విషయాలు మీడియాకు, అందరికీ తెలుస్తాయని, ఇందులో రాజకీయ, వేరే ప్రమేయం లేదని న్యాయవాది సలీం చెప్పారు.ఇటీవల వైద్య పరీక్షలకు తీసుకు వచ్చినప్పుడు మీడియాను చూసి తనకు ప్రాణ హాని ఉందని శ్రీనివాస్ అరిచిన విషయం తెలిసిందే.