అవును… జగన్ కు మత ఫీలింగ్ ఎక్కువే!

-

టీటీడీ భూముల అమ్మకాలకు సంబందించిన వార్తలు రాగానే… జగన్ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే! ఆ వ్యవహారానికి సంబందించిన నిర్ణయాలు తీసుకున్నది గత ప్రభుత్వమే అనే క్లారిటీ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు తగ్గలేదు! దీంతో గతంలో టీడీపీ తీసుకున్న నిర్ణయాలకు సంబందించిన జీవో ను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ మరో జీవో విడుదల చేసింది. దీంతో టీటీడీ భూముల అమ్మకం విషయం ప్రస్తుతానికి ముగిసిన అధ్యాయం! ఆ సంగతులు అలా ఉంటే… ఈ భూముల అమ్మకం టాపిక్ వెలుగులోకి రాగానే… ఇంతకాలం అవకాశాలు లేక ఖాళీగా ఉన్న రాజకీయ నిరుద్యోగులు, ప్రజల తిరస్కారాలను పుష్కలంగా పొందిన నేతలు ఉన్నఫలంగా మైకుల ముందుకు వచ్చేశారు… ఇందులో వారు చేసిన ప్రధాన విమర్శ… జగన్ క్రీస్టియన్ కాబట్టి, హిందూ మతాన్ని అణిచివేయాలని చూస్తున్నారని!

అవును జగన్ కు మత ఫీలింగ్ ఎక్కువే! అందుకు తాజా సాక్ష్యంగా నిలుస్తుంది టీటీడీ భూముల వ్యవహారం కాదు… కోవిడ్‌ విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులకు ఆర్థిక సాయం అందించిన వ్యవహారం! అవును జగన్ కు మతాలు అన్నా మతపెద్దలు అన్నా ఏమాత్రం గౌరవం లేదు. పైగా ఆయన దృష్టిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేరు వేరు! అందుకే వారిని చూసే క్రమంలో కూడా అందరినీ సమానంగా చూడరు! అందుకే… అర్చకులకు, పాస్టర్లకు, ఇమాం లకు, మౌజన్ లకు సమానంగా ఆర్థిక సాయం అందించారు! జగన్ కు హిందువులంటే పడదు అందుకే… మిగిలిన మతపెద్దలకంటే అధికంగా.. కరోనా సమయంలో ఇబ్బందిపడుతున్న సుమారు 33, 803 మంది అర్చకులకు ఆర్థిక సాయం అదించారు.

హిందుత్వం గురించి కబుర్లు చెప్పే ఏ ఒక్కరూ ఏనాడూ ఇలాంటి ఆలోచన చేసి ఎరుగరు! కొండపై పనిచేసే క్షురకులుపై జీతాలు ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తే… ఏమి చేసుకుంటారో చేసుకోండి, పొండి, తమాషాలు చేస్తున్నారా అని సమాధానాలు చెప్పిన ముఖ్యమంత్రులేమో హిందూ మత సంరక్షకులు… ఇలా అర్చకుల ఆకలిని అర్ధం చేసుకుని ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి హిందూ మత విధ్వేషి!! నేటి రాజకీయాలు అలా ఉన్నాయి మరి!

కాగా… గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారివారి ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నగదు జమ చేశారు. దీని ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ.37.71 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు.

Read more RELATED
Recommended to you

Latest news