విశాఖ జిల్లాలో జరుగుతున్న విశాఖ ఉత్సవ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అజెండాను ప్రత్యేక లఘుచిత్రం ఆవిష్కరించింది. విశాఖ ప్రత్యేకతను ఆవిశారించే విధంగా ఈ ప్రదర్శన ఉండగా… విశాఖలో ప్రతిష్టాత్మక సంస్థలు ప్రత్యేకతలు తెలిసే విధంగా ప్రదర్శనలు రూపొందించారు. ఇక విశాఖపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక అభిమానం అని స్లైడ్ షో ప్రదర్శించారు. విశాఖ కోసం జగన్ కట్టుబడి ఉన్నారని, ఆంధ్రుల కీర్తి బావుటాలా విశాఖ రెపరెపలాడుతోందంటూ ప్రత్యేక ప్రదర్శనలో పేర్కొన్నారు.
దీనిని అక్కడి జనాలు ఆసక్తిగా తిలకించారు. రూ.1285.32 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తర్వాత ఆయన ఉత్సవాలను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ విశాఖ ఉత్సవ్ అనేది జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ కి ఘన స్వాగతం పలకాలని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. అయినా సరే జగన్ రాకకు ఊహించిన విధంగా స్పందన రాలేదు అనే అభిప్రాయాలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి.
ఇక ఏర్పాట్లు కూడా జగన్ పర్యటనకు దారుణంగా ఉన్నాయని సమాచారం. దీనిపై జగన్ విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసారట. మూడు రోజుల నుంచి హడావిడి చేసి, కేవలం సెంటర్లలో జనాలని పోగేసి, హడావిడి చేసారు, ఇదేనా ఘన స్వాగతం అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనితో విశాఖ ఉత్సవ్‍లో మాట్లాడకుండానే వెనుదిరిగిన జగన్… ఆర్కే బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారట. రాజధానిగా ప్రకటించినా సరే జగన్ పర్యటనకు స్పందన రాకపోవడంతో వైసీపీ వర్గాలు కూడా అసహనంగా ఉన్నాయట.