హైదరాబాద్‌లోని నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో శుక్రవారం విచారణ జరగనుంది. ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. కాగా, సీబీఐ కోర్టుకు గత శుక్రవారం జగన్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ గతంలో పిటిషన్ వేశారు. అనంతరం అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 17కి వాయిదా పడింది.
అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. వాటిపై వచ్చేవారం తీర్పు రానుంది. దీంతో జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపును కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కేసులో వేసిన పిటిషన్‌పై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.