RRR లో అల్లూరి క్యారెక్టర్ గురించి సంచలన విషయాలు చెప్పిన చరణ్….!!

-

వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఇటీవల తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలతో ఊహకందని రీతిలో భారీ సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాల సక్సెస్ తో రాజమౌళి సహా హీరో ప్రభాస్ తో పాటు మిగతా నటీనటులు అందరికీ కూడా దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరు దక్కింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ అనే భారీ పీరియాడికల్ మూవీని తీస్తున్న రాజమౌళి, ఆ సినిమాను అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాడు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ సినిమాకు, వి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో రామ్ చరణ్ కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఆర్ఆర్ఆర్ అనేది టాలీవుడ్ కి ఎంతో కీలకమైన సినిమా అని, దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అన్నారు.

 

నేను, తారక్ ఇద్దరం కూడా తమ తమ పాత్రల కోసం ఎంతో కష్టపడుతున్నాం అని, ఇక తన విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు గారి పాత్ర కోసం తాను ఎన్నో విధాలుగా శరీరం, నటన విషయంలో కొంత హార్డ్ వర్క్ చేసానని అన్నారు. రాజమౌళి గారు అల్లూరి గారి పాత్రకు సంబంధించి చేసిన రీసెర్చ్ ని బట్టి, అచ్చం అల్లూరి గారి మాదిరిగా కనపడేందుకు మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలతో పాటు పలువురు సీనియర్ల సలహాలు కూడా తీసుకున్నానని అన్నారు. తప్పకుండా రేపు రిలీజ్ తరువాత సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందని చరణ్ చెప్పారు. ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి……!!

Read more RELATED
Recommended to you

Latest news