2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించిన వైయస్ జగన్ అదే జోరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలని మంచి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అత్యధిక మెజారిటీ స్థానాలు గెలవడం గ్యారెంటీ అనే ధీమా లో ఉన్నారు. దీంతో చాలా వరకు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు వైయస్ జగన్.
అయినా గాని పెద్దగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలం లేకుండా పోయింది. గుడివాడ నియోజకవర్గంలో బలమైన కేడర్ మొత్తం కొడాలి నాని దగ్గర ఉండటంతో…గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఎన్నికల విజయం గుర్రం ఇక్కడి నుంచి అనగా కొడాలి నాని ఇలాకా నుంచే స్టార్ట్ అయినట్లే అని అంటున్నారు ఆ ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక అభివృద్ధి పనులు జరగడంతో ప్రస్తుతం గుడివాడ మొత్తం వైసిపి పార్టీ మాయమైనది అనే టాక్ బలంగా నడుస్తోంది.