కరోనా నయమైనా.. వైరస్‌ శరీరంలో అలాగే ఉంటుందట..!

-

కరోనా వైరస్‌ వచ్చిన రోగులను 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఉంచి చికిత్సనందిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ లోపు వ్యాధి నయం అయినా.. ఆ తరువాత కొద్ది రోజుల వరకు ఆ వైరస్‌ ఇంకా శరీరంలో ఉంటుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. కరోనా తగ్గిందని అనుకోవద్దని, 14 రోజుల తరువాత కూడా వైరస్‌ ఇంకా శరీరంలో అలాగే ఉంటుందని వారు తెలియజేస్తున్నారు.

కరోనా వ్యాధి నయం అయిన పేషెంట్ల రక్త నమూనాలను సేకరించి వాటిలోని ఆర్‌ఎన్‌ఏ శాంపిళ్లను సైంటిస్టులు తాజాగా పరిశీలించారు. ఈ క్రమంలో ఆ వైరస్‌ వారి శరీరాల్లో అలాగే ఉన్నట్లు నిర్దారించారు. నిజానికి ఆ రోగులకు కరోనా వచ్చాక 20 రోజులకు సైంటిస్టులు సదరు టెస్టులు చేశారు. అయితే అప్పటికే వారికి వ్యాధి నయం అయిందని, అయినా ఆ వైరస్‌ మాత్రం శరీరంలో ఇంకా అలాగే ఉందని తేల్చారు. అందువల్ల కరోనా సోకిన వారు కనీసం 5 వారాల పాటు (35 రోజులు) ఎక్కడికీ తిరగకుండా, ఎవరితోనూ కలవకుండా ఐసొలేషన్‌లో ఉంటే మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు. కాగా సైంటిస్టులు చేసిన ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లోనూ ప్రచురించారు.

కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని లక్షల మందికి కరోనా సోకగా సుమారుగా 5వేల మందికి పైగా చనిపోయారు. ఇక భారత్‌లో 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version