వైసీపీ అధినేత తనను నమ్ముకున్న వాళ్లకు.. తన కోసం త్యాగాలు చేసిన వాళ్లకు ఎంత ప్రయార్టీ ఇస్తారో మరోసారి రుజువు అయ్యింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ముందుకు దూసుకు వెళుతున్నారు. అటు పాలనా పరంగా జగన్ ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ఇంకా చెప్పాలంటే 2014 ఎన్నికలకు ముందే పార్టీలో చేరిన వారికి ఎంతో ప్రయార్టీ ఇస్తున్నారు.
ఇక ఈ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది జగన్ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నారు. పృథ్వి లాంటి వాళ్లు ముందు నుంచి జగన్ఖు అండగా ఉన్నారు. అయితే ఆలీ, జయసుధ, జీవితా రాజశేఖర్ దంపతులు లాంటి వాళ్లు చాలా మందే పార్టీలో చేరారు. ఇక జగన్‌కు దగ్గర బంధువు అయిన సీనియర్ నటుడు మోహన్‌బాబు కూడా ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు.
అయితే వీరంతా కూడా సినిమా ఇండస్ట్రీ కోటాలో తమకు జగన్ పదవులు కట్టబెట్టాస్తారని అందరు అనుకున్నారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.ఇచ్చి జగన్ అందరికీ షాకిచ్చారు. కీలకమైన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని టాలీవుడ్ లోని చాలా మంది ఆశిస్తున్నారు. ఎన్నికల ముందర జగన్ పార్టీలో చేరిన అలీ జీవితా రాజశేఖర్ మోహన్ బాబు జయసుధలకు దక్కుతాయని అందరూ భావించారు.
అయితే జగన్ వీరందరికి షాక్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఈ పదవిపై కన్నేసిన వారిని పక్కన పెట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో కలిసి నడుస్తోన్న సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు ఈ పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్ పెద్దలకు (వైసీపీలో ఉన్న వారికి) కాస్త పెద్ద షాకే అంటున్నారు. విజయ్‌చందర్ నాటి నుంచి నేటి ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. ఆయన సినిమాల్లో సాయిబాబాగా, కరుణామయుడులో ఏసుప్రభుగా నటించాడు.
ఇక జగన్ జైలులో ఉన్నప్పుడు, షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన వైసీపీకి ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. జగన్ నిర్ణయంపై పార్టీలో మాత్రం హర్షం వ్యక్తం అవుతోంది. అదే టైంలో వైసీపీకి సపోర్టర్స్‌గా ఉన్న టాలీవుడ్ ప్రముఖులకు మాత్రం పెద్ద షాకింగ్‌గా మారింది.