బ్రేకింగ్‌ : ఏపీలో శాసనమండలి రద్దు దిశగా జ‌గ‌న్ స‌ర్కార్..!

-

ఏపీ అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికార వైసీపీ.. శాసనమండలిలో మాత్రం తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఇబ్బందిపడుతోంది. ఇదిలా ఉంటే..ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం, ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లులకు శాసనమండలిలో చిక్కెదురైంది. ఈ రెండు బిల్లులను శాసనసభకు తిప్పి పంపుతూ మండలి తీర్మానం చేసింది. దీంతో, మండలిలో ఈ బిల్లులకు ఆమోదం లభించనట్టైంది. ఈ నేపథ్యంలో, వచ్చే సమావేశాల్లో ఈ బిల్లులపై మరోసారి శాసనసభలో చర్చ జరపాల్సి ఉంటుంది.

ఆ తర్వాత కూడా శాసనమండలి ఈ బిల్లులపై విభేదిస్తే… చివరకు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే శాసనసభలో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉంది. కానీ, మండలిలో మాత్రం విపక్షాల సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది. దీంతో, శాసనసభలో ఆమోదం పొందే బిల్లులకు… మండలిలో చిక్కెదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీ రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఏపీలో శాసన మండలి రద్దు యోచనలో ప్రభుత్వం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. శాసనమండలిని నిర్వహించడం ఆర్థికంగా పెనుభారం అనే కారణంతో దాన్ని రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news