ఏపీ రోడ్ల నిర్మాణం పై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు పాలనాపరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయండని.. అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే టెండర్లకు వెళ్లాలని..మే 15 -20 తేదీల నాటికల్లా పనులు ప్రారంభం కావాలని పేర్కొన్నారు.
ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రెండింటిలోనూ రోడ్లకు సంబంధించి నాడు-నేడు ఫోటోలు డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్ కింద జగనన్న కాలనీల్లో నీటిసరఫరా అత్యధిక ప్రాధాన్యతతో చేపట్టాలని స్పష్టం చేశారు.
సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిర్వహణ కింద చేపడుతున్న పనులన్నీ అక్టోబరు నాటికి 100శాతం పూర్తి కావాలని.. అక్టోబరు 2 నాటికి ఏ గ్రామం వెళ్లినా సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ పక్కాగా ఉండాలి, ఊర్లన్నీ క్లీన్‌గా కనిపించాలని పేర్కొన్నారు. ప్రతి పంచాయతీకి చెత్త తరలింపునకు ట్రాక్టర్ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో దశలవారీగా లిక్విడ్ వేస్ట్ మేనేజిమెంట్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.