సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పరువు నష్టం దావావేసేందుకు ఆమెకు కేసీఆర్ సర్కార్ నిధులు సమకూర్చడాన్ని తెలంగాణ హై కోర్టు తప్పుబట్టింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారంటూ 2015 లో ఔట్ లుక్ మ్యాగజీన్ పై స్మితా సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టు ఫీజుల నిమిత్తం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై ఔట్ లుక్ తోపాటు మరో ఇద్దరు తెలంగాన హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని, ఐఏఎస్ అధికారి వ్యక్తిగతంగా వేసిన వ్యాజ్యానికి ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుందని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థపై కేసు వేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కాదని పేర్కొన్న హై కోర్టు.. రూ.15 లక్షల మొత్తాన్ని 90 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆమెను ఆదేశించింది.