జగన్ కీలక నిర్ణయం…కాపు నేతల కేసులపై ఎత్తివేత

-

ఏపీలో రిజర్వేషన్ల కోసం గతంలో కాపులంతా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే..ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో వీరు అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అయితే 2016లో తుని ఘటలో కాపు ఉద్యమ నేతలపై అప్పటి ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. వీటితో పాటు ఏపీలో కాపు ఉద్యమ సమయంలో జరిగిన అన్ని ధర్నాల్లోనూ కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. అయితే సీఎం జగన్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు..

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ 2016 లో జరిగిన ఉద్యమం సందర్భంగా నమోదైన అన్ని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తుని గ్రామీణ,పట్టణ,తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 51 కేసులను ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ ఆస్తుల దహనం, విధ్వంసం, మారణాయుధాలతో అల్లర్లు చేయడం, ప్రభుత్వోద్యోగులపై దాడిలాంటి అభియోగాలతో నమోదైన పలు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కాపులు ఎలా స్పందిస్తారో చూడాలి. అంతేకాక ఈ నిర్ణయం వైసీపీ కాపు ఓటు బ్యాంకును ఎంత వరకూ ప్రభావితం చేస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news