తనపై జరిగిన దాడి గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోరారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని నేను క్షేమంగానే ఉన్నానన్నారు… ప్రజల ప్రేమానురాగాలు, ఆశీర్వాదంతో తాను సురక్షితంగా ఉన్నానని, హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రి నుంచి జగన్ ట్వీట్ చేశారు. ఇలాంటి పిరికిపంద దాడులతో తనను ఏం చేయలేరన్నారు, విశాఖపట్నం విమానాశ్రయంలో జనుపల్లి శ్రీనివాస్ అనే యువకుడు జగన్‌పై దాడికి పాల్పడిన విషయం విదితమే. ఎవరెన్ని కుట్రలు చేసిన తన ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు.
నేను క్షేమంగానే ఉన్నా…
-
Previous article