తండ్రీకొడుకుల బంధం అనేది చాలా ఉన్నతమైనది. తండ్రీ కోసం కొడుకు.. కొడుకు కోసం తండ్రి పడే ఆరాటం, తపన అనేది ఎంతో బాధ్యతగా ఉంటుంది. కొడుకు కోసం తండ్రి బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కొడుకు కూడా తండ్రి కోసం అంతే బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కొడుకు ఏదడిగినా క్షణాల్లో తండ్రి తెచ్చిస్తాడు. కొండ మీది కోతినైనా తీసుకొచ్చి ఇస్తాడు తండ్రి. కొడుకంటే అంత ప్రేమ తండ్రికి. కొడుకుకు కూడా అదే విధంగా తండ్రంటే గౌరవం ఉండాలి.. బాధ్యత ఉండాలి. అప్పుడే తండ్రీకొడుకుల బంధం పటిష్టంగా ఉంటుంది.
కానీ.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం కాస్త కఠినంగా ఉంటుంది. ఓ కొడుకు తన తండ్రిని చితకబాదుతున్న ఘటన అది. కన్న కొడుకు.. 80 ఏళ్ల వృద్ధ తండ్రిని ఎందుకు కొడుతున్నాడనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కేవలం తన కొడుకు పర్మిషన్ లేకుండా తన భార్యకు స్వీట్లు తినిపించడమే ఆ తండ్రి చేసిన తప్పు. తన భార్యకు డయాబెటిస్ వ్యాధి ఉందట. అయినా కూడా కొడుకు పర్మిషన్ తీసుకోకుండా స్వీటు తినిపించాడట ఆ తండ్రి. దీంతో ఆ విషయం కొడుకుకు తెలిసి.. తండ్రిని తీవ్రంగా కొట్టాడు. పక్కింటి వ్యక్తి ఆ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
80 ఏళ్ల తండ్రిని చితకబాదిన కొడుకు.. ఎందుకో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు..!
-