సీఎంగా తొలిసారి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న జ‌గ‌న్‌

-

తిరుమ‌ల‌లో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే భ‌క్తుల ర‌ద్దీ మ‌రింత కొన‌సాగుతోంది. అయితే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం జరగనుంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనంపై ఊరేగనున్న మలయప్పస్వామి సేవలో సీఎం పాల్గొంటారు. ఈ క్ర‌మంలోనే రాత్రికి తిరుమలలోనే జగన్ బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news