ఏపీ హైకోర్టుకు వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్ష నేత హోదా కోసం పిటిషన్‌..!

-

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్  ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ లో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని సూచిస్తూనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని, తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని ఆరోపించారు.

రెండు నెలల క్రితం జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓటమి పాలైంది. 151 స్థానాల నుంచి ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనకు కలిపి 164 స్థానాలు దక్కించుకున్నాయి. గతంలో వైసీపీకి 21 ఎంపీ స్థానాల్లో గెలుపొందగా ఈసారి 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందడానికి 18 సీట్లు గెలుపొంది ఉండాలని అధికార సభ్యులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news