వైఎస్ షర్మిల మౌనదీక్ష భగ్నం.. అరెస్టు

-

మహిళలపై జరుగుతున్న ఆగాయిత్యాలకు నిరసనగా… వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద మౌనదీక్షకు దిగారు. షర్మిల దీక్ష గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీక్షను భగ్నం చేసిన అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. షర్మిలను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేఫథ్యంలో షర్మిల అరెస్టును నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు అయిందని షర్మిల అన్నారు. ఒక్క కవితకు తప్ప రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో.. మహిళల కిడ్నాప్ విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 20వేల మంది అత్యాచారానికి గురవుతున్నారని విమర్శించారు.

మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ముఖ్య మంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌కు ఆడవాళ్ల పట్ల వివక్ష ఉందని ఆమె ఆరోపించారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్ ఎక్కడ అమలవుతుందో చూపాలని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news