దారికొచ్చిన వారిపై దయ.. మాట విననివారిపై కేసులు : మంత్రి నిరంజన్ రెడ్డి

-

దిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ మంత్రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్​ను, బీఆర్​ఎస్ పార్టీని ఎదుర్కోలేక కవితపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కవితకు ఈడీ నోటీసులివ్వడం విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.

దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి విశ్వసనీయత దెబ్బతీసిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. అదానీ గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపదని ప్రశ్నించారు. ఆ అంశంపై ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు దర్యాప్తు చేయవని నిలదీశారు.

“ఎమ్మెల్యేలను కొని బీజేపీ అక్రమంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసింది నిజం కాదా. మాటవినని వారిపై కేసులు పెడుతున్నారు. దారికి వచ్చిన వారిపై దయచూపిస్తున్నారు. మేఘాలయ ఎన్నికల్లో సీఎం సంగ్మాపై అవినీతి ఆరోపణలు చేయలేదా.
ఎన్నికల అనంతరం సంగ్మాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజం కాదా? సంగ్మా ప్రమాణ స్వీకారానికి బీజేపీ నేతలు వెళ్లడం ద్వంద్వ నీతికి నిదర్శనం” అని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news