రాష్ట్రమంతా తిరుగుతాం ప్రతి పల్లెకు పోతాం..ఇడుపులపాయలో షర్మిల..!

ఇడుపులపాయ వైఎస్ ఆర్ ఘాట్ వ‌ద్ద షర్మిల మాట్లాడుతూ…వైయస్సార్ సంక్షేమ పాలన అంటే ఉచిత విద్య, వైద్యం.. రైతుల కి ఉచిత విద్యుత్ జల యజ్ఞం రుణమాఫీ అని అన్నారు. తెలంగాణలో వైయస్సా ర్ సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుందన్నారు. ఇది త‌న‌ సమాధానం కాదని.. ఇది తెలంగాణ ప్రజల సమాధానమ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు రావడమే లక్ష్యంగా రేపు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలు పెడుతున్నామ‌ని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు.

Sharmila
Sharmila

రాష్ట్రమంతా తిరుగుతామ‌ని ప్రతి పల్లెకు పోతాం ప్రతి గడపను తడతామ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకం అవుతామ‌ని… ప్రజల కష్టాలను వారి నోటి నుంచి వింటామ‌ని చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామ‌ని ష‌ర్మిల చెప్పారు. వైయస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు రావడమే లక్ష్యంగా చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజలంతా వైఎస్సార్ అభిమాను లంతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థి స్తున్నట్టు తెలిపారు. త‌మ‌ అడుగులో అడుగు వేయాల‌ని…అంతా కలిసి పోరాడితే వైయస్సార్ సంక్షేమ పాలన మళ్లీ సాధ్యమ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.