మీ గుండెలు… రాతి బండలు : కేసీఆర్ పై షర్మిల ఫైర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ పై వైఎస్‌ ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ కు గుండె లేదంటూ హ్యష్‌ ట్యాగ్‌ వాడి ఆమె ట్వీట్‌ చేశారు షర్మిల. మీ గుండెలు… రాతి బండలు అంటూ నిప్పులు చెరిగారు వైఎష్‌ షర్మిల. తుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర .. రైతులు అదే వాసాలకు ఉరివేసుకొంటుంటే…. ఆదుకోవడం చేతకాని దొరగారికి రాజకీయ డ్రామాల కోసం ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనౌతుందని చురకలు అంటించారు.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకొంటుంటే .. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని దొరకు… తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుందంటూ ఫైర్‌ అయ్యారు షర్మిల. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని మీరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. విద్యార్థుల త్యాగాల మీద పదవులను అనుభవిస్తూ వారిని ఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలంటూ కేసీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.