పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి : వైఎస్ షర్మిల

-

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వైతెపా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర శుక్రవారం రోజున అచ్చంపేట పట్టణానికి చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలను ధరించి పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. పాలమూరుకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారనడానికి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యమే నిదర్శనమన్నారు.

నియోజకవర్గంలోని ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టు పనులు ప్రారంభించడంలో నిర్లక్ష్యం వీడాలని షర్మిల డిమాండ్ చేశారు. అచ్చంపేటలో నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆస్పత్రిని ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ గువ్వల బాలరాజు ప్రారంభించక పోవడం సిగ్గుచేటని అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వ విప్‌ నోరు మెదపకపోవడం దారుణమని షర్మిల మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version