పాదయాత్రపై షర్మిల క్లారిటీ, అక్కడి నుంచే…?

తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేస్తే.. ఎక్కడి నుంచి చేస్తోందో అనే దానిపై కొన్ని రోజులుగా అందరిలోనూ ఆసక్తికర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే కొద్ది సేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశఃలో వైఎస్‌ షర్మల.. తన పాదయాత్ర పై కీలక ప్రకటన చేశారు. తాను చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెడతానని షర్మిల పేర్కొన్నారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

వైఎస్సార్ చనిపోయిన తర్వాత మా గతి ఏమౌతాయి అని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారని.. తెలంగాణ ప్రజలను వైస్సాఆర్‌ గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదని… ఇది నా గడ్డ.. దీనికి మేలు చేయడానికి వచ్చానని తెలిపారు. పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరని..తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని… వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామన్నారు. కాగా… పాదయాత్ర చేస్తామని… రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌ లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.