నన్ను చంద్రబాబు సస్పెండ్ చేసినా..ఆ పార్టీ కోసం పనిచేస్తా : జేసీ సంచలనం

అనంతపురం : తాడిపత్రి నిర్వహించిలో ఆత్మీయ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఫుణ్యం తో మున్సిపల్ ఛైర్మన్ అయ్యానని… చంద్రబాబు దయతో ఎమ్మెల్యే అయ్యానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పై చంద్రబాబు కి ఫిర్యాదు చేసినా… నన్ను చంద్రబాబు సస్పెండ్ చేసినా…. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కోసం పనిచేస్తానన్నారు.

పార్టీకి ఎవరు ద్రోహం చేయరాదని హితువు పలికారు. నాయకులందరూ బయటికి రండి. కార్యకర్తల కు అండగా ఉండండి రాజకీయ నాయకులు ఫ్లెక్సిలు వేసుకోవద్దని… సమాజంలో మార్పు వచ్చింది.. జనాన్ని గుర్తించాలని తెలిపారు. అనంతపురంలో 10 వేల మంది తో త్వరలో సమావేశం నిర్వహిస్తానని.. కొందరు పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

కొందరికి పదవి కమాండ్ చేసే వారికి ఇచ్చారని… మాకు పదవి ఇచ్చినా… ఇవ్వకున్న పార్టీని నూతన ఉత్తేజంతో ముందుకు తీసుకు వెళ్లుతానని స్పష్టం చేశారు. టీడీపీ ని బలోపేతం చేయడానికి… చంద్రబాబు ను సీఎం ను చేయడానికి తాను ఎవరి నైనా ఎదిరిస్తానని…ఎంత దూరం అయిన వెళతామన్నారు. పార్టీ కోసం పనిచేయడానికి పదవి అవసరం లేదని… పల్లె పల్లెకు తిరుగుతాం… కార్యకర్తలను కలుస్తామని స్పష్టం చేశారు.