వైఎస్ వివేకా కేసు అప్డేట్…!

-

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారారు. వివేకాను హత్య చేస్తే 40 కోట్లు ఇస్తానని వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగిరి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు. దాంతో ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని శివశంకర్ రెడ్డికి సిబిఐ నోటీసులు జరిసింది. కానీ అనారోగ్య కారణంతో రాలేకపోతున్నాను అంటూ శివశంకర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

A-key-twist-in-the-YS-Viveka-murder-case-1623132474-1636
A-key-twist-in-the-YS-Viveka-murder-case-1623132474-1636

ఇక శివ శంకర్ రెడ్డి ని హైదరాబాద్ లో అరెస్టు చేసి సీబీఐ విచారించింది. ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆయనను ట్రాన్సిట్ వారెంట్ కోసం నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు సీబీఐ హాజరు పరిచింది. ఇక శివశంకర్ రెడ్డిని హైదరాబాద్ నుండి పులివెందుల కు సీబీఐ తరలించింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ న్యాయమూర్తి ఇంటి ముందు సీబీఐ హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై శివ శంకర్ రెడ్డిని కడప కి తరలించారు. నేడు పులివెందల కోర్ట్ లో సీబీఐ శివశంకర్ రెడ్డిని హాజరుపరచనుంది.

Read more RELATED
Recommended to you

Latest news