తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు పంపింది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది సిబిఐ. దీంతో సిబిఐ కార్యాలయానికి బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలోనే వెనుదిరిగారు. కాగా ఆయనని ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించవద్దని సిబిఐ ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విచారణ జరపనున్న న్యాయస్థానం.. సాయంత్రం 5 వరకు ఆయనను ప్రశ్నించవద్దని సిబిఐ ని ఆదేశించింది. దీంతో ఆ తర్వాతే విచారిస్తామని చెప్పిన సిబిఐ అధికారులు.. తాజాగా మంగళవారం ఉదయం 10:30 కి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.