వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ 100 వ రోజుకు చేరింది. అందులో భాగంగా వివేక నంద రెడ్డి ముఖ్య అనుచరుడు… ఎర్ర గంగిరెడ్డి ని కడపలో సాయంత్రం నుంచి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎర్ర గంగిరెడ్డి కి కడప రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు సిబిఐ అధికారులు.

ఎర్ర గంగిరెడ్డి ని సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. మొత్తానికి గంగిరెడ్డి ని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. కాగా నిందితుడు సునీల్ యాదవ్ రక్త నమూనాలు సేకరించేందుకు అనుమతి కోరుతూ సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న పులివెందుల కోర్టు నమూనాల సేకరణ కు అనుమతి నిరాకరించింది. నిందితుడు సునీల్ యాదవ్ కు ఈ నెల 29 వరకు రిమాండును పొడిగించింది. ఇక ఈ కేసులో మరో నిందితుడు అయిన ఉమా శంకర్ రెడ్డి ని కస్టడీకి కోరుతూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news