వైఎస్సార్ భీమా పథకం..రూ.2 లక్షలు ఆర్థిక సాయం..

-

ఏపీ ప్రజల కోసం జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమల్లొకి తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా, అమ్మవడి, మహిళలకు రుణాలు, పించన్లు ఈ పథకాలకు జనం మద్దతు లభించింది.ఇప్పుడు ఉచిత ఆరోగ్యం, వైఎస్సార్ భీమా పథకం కూడా అందుబాటులో ఉన్నాయి.వైఎస్సార్ బీమా పేదల జీవితాలకు ధీమాగా ఉంటుందని సర్కారు భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతు భీమా పథకాన్ని నమోదు చేసుకున్నారు. తాజాగా కడప జిల్లాలో ఈ పథకం పై కలెక్టర్ అవగాహన కల్పించారు.

కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైస్సార్ బీమా పథకం, ఈ-శ్రమ్ సభ్యత్వ నమోదు అంశాలపై ఆయన విలేకరులతో మాట్లా ్లడారు. ఇంటిని పోషించే పెద్ద చనిపోవడంతో.. ఆ కుటుంబం అనాఽథగా మారకూడదన్న ఉద్దేశ్యంతో వైఎస్సార్ బీమా పథకా నికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులందరూ వెంటనే ఈ పథకంలో తమ పేర్లు నమోదు చేసుకో వాల న్నారు. జిల్లాలో 3.50 లక్షల రేషన్కార్డులు ఉన్నాయని, అందులో ఇప్పటికే 2.50 లక్షల మంది వివరాలు వైఎస్సార్ బీమా పథకంలో చేసినట్లు తెలిపారు. మిగిలిన వాళ్లను కూడా నమోదు చేయించాలన్నారు.

ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగి కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఐదు లక్షల రూపా యలు బీమా వర్తిస్తుందన్నారు. అదే విధంగా అసంఘటిత కార్మికులందరూ వాళ్ళ కుటుంబాలకు అండగా, ఈ-శ్రమ్ పోర్టల్లో సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఉచిత నమోదు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.

నమోదు చేసుకున్న అసంఘటిత కార్మి కులు ప్రమాదానికి గురై మరణిస్తే రెండు లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే లక్ష రూపాయల బీమా వర్తిస్తుందన్నారు.ఈ నెల 30 లోగా జిల్లా పరిధిలో అర్హులం దరూ జూన్ 30లోగా ఈ పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ గిరీషా పేర్కొన్నారు..అనంతరం విలెకర్ల తో ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news