సీఎం జగన్ రెండు రోజుల వైయస్ఆర్ జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. రేపు, ఎల్లుండి లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్. తాజాగా ముఖ్యమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు కలెక్టర్ విజయరామరాజు. రేపు ఉదయం సీఎం వైఎస్ జగన్ తన నివాసం నుంచి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు బయలుదేరుతారు. 12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఇక 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. డిసెంబర్ 3న ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్ నుంచి పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. అక్కడ 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. ఇక 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.