ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ

-

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి 24న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించనుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ. 700 కోట్ల మేర అకౌంట్లలో జమ చేయనుంది.

cm jagan

సచివాలయంలో నిన్న ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ రైతుల ఖాతాల్లో ఇన్ పుట్‌ సబ్సీడీ వేయాలని నిర్నయం తీసుకుంది జగన్‌ కేబీనేట్. అటు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద కొత్తగా ఎనర్జీ పార్కు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడి తో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడి తో ఎన్టీపిసి ప్రాజెక్టు కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొత్తంగా 61వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version