ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఓ గొప్ప అధ్యాయమని చెప్పాలి. గాంధీ చూపిన బాటను అనుసరించి ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తలో చైతన్య స్ఫూర్తిని రగిలించారు. ప్రజల జ్ఞాపకాల పొరల్లో ఇంకిపోయిన పాదయాత్ర. మండుటెండల్లో వైయస్సార్ మొదలుపెట్టిన పాదయాత్ర. అది ఓ గొప్ప ఆశయంతో తలపెట్టిన పాదయాత్ర. అది అనితరసాధ్యమైన సంకల్పంతో సాగిన యాత్ర..ప్రజలకోసం సాగిన యాత్ర. 2003. ఏప్రిల్ 9. ఎండాకాలం. మండేకాలం మొదలైంది. ఎక్కడికక్కడ సమస్యలను గుర్తించి..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై హామీ ఇచ్చారు.
ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చాకా ఆ హామీలను నిలబెట్టుకోవడం ఆయనలోని దార్శనికతకు..ఆచరణత్వాని
కురవని వర్షాల పాలనా కాలంలో…వైయస్సార్ పరామర్శ…భవిష్యత్తుకు సంబంధించిన చల్లని గాలులతో సేదతీర్చింది. తెలంగాణా జిల్లాల నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాను చుట్టేసిన పాదయాత్ర..ప్రజల్ని సేదతీర్చిన ప్రజాప్రస్థానయాత్ర. పాదయాత్ర కాలంలోనే వైయస్సార్ ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. విద్యుత్‌బకాయిలను మాఫీ చేస్తానన్నారు. అన్నదాతల్ని గుండెల్లో పెట్టుకుని చూస్తానన్నాడు. వ్యవసాయాన్ని కళ్లల్లో పెట్టుకుంటానన్నాడు.
పల్లెతల్లి గుండెదిటవును పెంచింది వైయస్ ప్రజాప్రస్థానం. 2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.