స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల వైసీపీ పార్టీలో ఇతర పార్టీలలో నుండి బాగా చేరికలు జరిగాయి. చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఇటీవల వైసీపీ పార్టీలో భారీగా చేరడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా పార్టీలో చేరిన నాయకులపై కొంతమంది వైసీపీ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పూర్తి మేటర్ లోకి వెళ్తే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కి చెందిన నాయకుడు తన చేతిలో ఓడిపోయిన టిడిపి నాయకుడు పార్టీలో చేరడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట.
అయితే ఎమ్మెల్యే ప్రశ్నకు దీటుగా హై కమాండ్ నుండి రిప్లై వచ్చిందట. పార్టీలో ఉంటే ఉండు ఎగస్ట్రాలు చేయవద్దు అనేటట్టుగా సదరు ఎమ్మెల్యే కి వైసీపీ హైకమాండ్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వార్త వైసీపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మరోపక్క టిడిపి పార్టీ నుండి ఇంకా జాయిన్ అవ్వడానికి చాలా మంది నాయకులు రెడీ అవుతున్నారట.