వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ తన ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా సొంత పార్టీ నేతలకు కూడా అదే స్థాయిలో వణుకు పుట్టించే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం లో ఎక్కడ అవినీతి జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా అన్ని విధాలా పరిపాలనలో జాగ్రత్తలు తీసుకున్నారు జగన్. ఇటువంటి నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని తాజాగా వైయస్ జగన్ సర్కార్ ప్రకటించడం జరిగింది.
అయితే జరగబోయే ఈ ఎన్నికలలో సొంత పార్టీ నేతలను కట్టడి చేసే విధంగా ఎన్నికలలో టిక్కెట్లు ఇచ్చే విషయంలో చాలా స్ట్రిక్ట్ నిర్ణయాలు జగన్ తీసుకున్నట్లు వైసీపీ పార్టీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైసిపి పార్టీ నేతలు అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని మంచి ఉత్సాహం మీద ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అసలు ఎవరు పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారో అన్నది డిసైడ్ చేసేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని ఈ విషయంలో నేతలెవరూ కలుగ చేసుకోకూడదని తాజాగా జగన్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు.
ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు ఎవరు అనేది తమ దగ్గర పక్కా సమాచారం ఉందని, అభ్యర్థుల ఎంపిక క్షేత్రస్థాయిలో ఎవరి బలం ఏమిటి అనేది స్పష్టంగా సర్వే ద్వారా తెలుసుకున్నామని ప్రకటించడంతో నాయకుల గుండెల్లో వణుకు మొదలైంది. దీంతో చాలామంది పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకులు తమ అనుచర వర్గానికి మేము ఏమి సమాధానం చెప్పాలి అంటూ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయంపై అసహనం చెందుతున్నట్టు సమాచారం.