వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి… బీజేపీలోకి వైసీపీ కీల‌క నేత‌…!

-

ఈ టైటిల్ ఇంట్ర‌స్టింగ్ ఉందే అనుకుంటున్నారా ? ఇది నిజం ఇప్పుడు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే మాట హ‌ల్‌చ‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌న్న సందేహాలు, ఆందోళ‌న‌ల‌తో ఆ పార్టీ నేత‌లు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ లిస్టులోనే టీడీపీ మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గంటా పార్టీ మారేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నార‌ని.. ఆయ‌న ఆగ‌స్టు 15వ తేదీలోగా ఆయ‌న పార్టీ మార్పు ఉంటుంద‌ని అంటున్నారు. గంటా త‌న‌తో పాటు త‌న టీంలో ఉన్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు, మ‌రో ముగ్గురు, న‌లుగురు మాజీ ఎమ్మెల్యేల‌తో సహా పార్టీ మార‌తార‌ని అంటున్నారు.

ఇక అదే విశాఖ జిల్లాకు చెందిన మ‌రో మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు కాచుకుని ఉన్నారా ? అంటే ఆయ‌న తాజా వ్యాఖ్యలు అవున‌నే చెపుతున్నాయి. మోదీ అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణానికి శంకుస్తాప‌న చేయ‌డంతో అయ్య‌న్న మోడీతో పాటు బీజేపీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు త‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న గంటా వైసీపీలో చేరే ఏర్పాట్ల‌లో ఉండ‌డంతో అయ్య‌న్న బీజేపీ వైపు చూస్తున్నట్టు టాక్‌..?

ఈ లిస్టులో మ‌రో నేత ఉన్నా ఆయ‌న పార్టీ మార్పు మాత్రం ట్విస్టింగ్‌గానే ఉంది. అధికార వైసీపీ నేత ఒకరు కూడా అదేబాటలో బీజేపీలోకి చేరబోతున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స‌ద‌రు వైసీపీ నేత ఎంపీగా ఉండ‌డం మ‌రో విశేషం. ఆ నేత ఎవ‌రో కాదు న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు. కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపైనా, సీఎం జ‌గన్‌పైనా ఇష్టారాజ్యంగా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో పాటు బీజేపీకి మ‌రింత చేరువు అవుతున్నారు. వైసీపీ ఇప్ప‌టికే ర‌ఘును వ‌దిలించుకోవాల‌ని చూస్తుండ‌గా.. బీజేపీ ద‌గ్గ‌ర చేర్చుకోవాల‌ని చూస్తోంది. ఏదేమైనా ఏపీలో ఈ ముగ్గురు నేత‌ల జంపింగ్ రాజకీయం ఆస‌క్తిగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version