ఇటీవలే గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం భారీ వరదలతో అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా చేతికొచ్చిన పంట కాస్తా పూర్తిగా నాశనం అయిపోయింది. ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది. ఎటు వెళ్లలేని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు తెలంగాణ ప్రజలు
అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తెలంగాణ వరద బీభత్సం పై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. త్వరలో వరదల బీభత్సం తగ్గి పరిస్థితులు సద్దుమణుగుతాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు తగ్గుముఖం పట్టాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. వరదల్లో సహాయం చేసేందుకు ఫ్రంట్లైన్ వారియర్స్ ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు యువరాజ్ సింగ్.