రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్‌ను ఒమన్ నుంచి బహిష్కరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒమన్ పర్యటన సందర్భంగా నాయక్ ని మార్చి 23న అదుపులోకి తీసుకోవడానికి ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. నాయక్ ఒమన్ లో రెండు ఉపన్యాసాలని ఇచ్చేందుకు ఆహ్వానించారు. ది కురాన్ ఏ గ్లోబల్ నేసిసిటీ నీ ఒమన్ యొక్క అవ్కాఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడింది.
మార్చి 23 మొదటి రోజున షెడ్యూల్ చేయబడింది. రెండవ ఉపన్యాసం మార్చి 25 సాయంత్రం సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలో షెడ్యూల్ చేసారు. స్థానిక చట్టాల ప్రకారం అతన్ని బహిష్కరించడానికి ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ సంప్రదింపులు చేస్తోంది. అతనిని అదుపులోకి తీసుకోవడానికి ఇది మంచి సమయం అని ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ వర్గాలు తెలిపాయి.
నిర్బంధం తర్వాత ఫాలో అప్ కి MEA ఒమన్ రాయబారితో ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీస్ సంప్రదించింది. భారత దేశంలో మనీలాండరింగ్ తో పాటు ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణలను ఎదుర్కొంటున్న నాయక్ మలేషియాలో ఉంటున్నాడు. 2017 లో పారిపోయిన వాడిలానే ఉంటున్నాడు.
1990 ల్లో దావా ద్వారా పేరు పొందాడు. ‘comparative religion’ పీస్ టీవీ ఫౌండర్ కూడా. ఈ ఛానెల్ కి వంద మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. నాయక్ మలేషియాకు వెళ్ళిపోయాడు. చట్టం నుండి తప్పించుకోవడానికి ఇలా చేసాడు. ప్రసంగాలు చేయకుండా దేశం నిషేధించింది. 2020లో “జాతీయ భద్రత” ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.