ప్రజా ఆశీర్వాదం పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలు
ఎన్నికల ప్రచారాన్ని వచ్చేనెల మూడు నుంచి మొదలు పెట్టనున్నట్లు తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన వెల్లడించారు. దీని ప్రకారం మూడో తేదీన ఉమ్మడి నిజామాబాద్, 4న ఉమ్మడి నల్గొండ, 5న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, 7న ఉమ్మడి వరంగల్, 8న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. నిజామాబాద్‌లో మూడో తేదీన ప్రజాఆశీర్వాద సభ పేరిట దీనిని నిర్వహిస్తారు. సభ నిర్వహణకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవితలకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ప్రతీ నియోజకర్గం నుంచి కనీసం 50వేలకు మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని ఆయన సూచించారు.
సభను గిరిరాజ్ కళాశాల మైదానం లేదా నగర శివార్లలోని 37 ఎకరాల స్థలంలో దీనిని నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చింది. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై బుధవారం సాయంత్రానికి క్లారిటీ రానుంది. ఇప్పటికే నియోజకవర్గాల్లోని అసమ్మతులను విడలవారీగా బుజ్జుగిస్తూ విజయానికి ఎలాంటి అవరోధాలు లేకుండా తెరాస అధినేత వ్యూహం రచిస్తున్న సంగతి తెలిసిందే.