ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై బాబు స్పందించారు. తెలుగు దేశం పార్టీ హూందాతనానికి ప్రతీక నాటి నుంచి నేటి వరకు పార్టీ సిద్ధంతాల ప్రకారమే పనిచేస్తున్నాం..చేస్తాం. కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలు చాలా బాధించాయన్నారు. తనలా నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేను. తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన తనపై కేసీఆర్ ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. 40 ఏళ్ల పార్టీ కార్యకర్తల బలంతో పెనవేసుకుని ఉంది అలాంటి పార్టీని ఐదేళ్లలోనే అంతం చేయాలని చూసస్తే ఎలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ నల్గొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెదేపా అధినేత, ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.