ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణము. ఇప్పటికే చాలామంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోలు రాజకీయ అరంగేట్రం చేశారు. అలాగే వారు ఎన్నికలలో గెలిచి పార్లమెంట్ లోకి కూడా వెళ్లారు. తాజాగాఈ రంగుల ప్రపంచం నుంచి మరొక తార ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు…. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు ,కన్నడం మరియు హిందీ చిత్రాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో కామెంట్లు పెడుతూ ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది.
కంగనారనాథ్ 2024 లోక్సభ ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తుందని తన తండ్రి అమర్ దీప్ తెలిపాడు. కానీ ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తుందో ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపాడు. ఇటీవలే కంగనా రనౌత్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో పూజలు నిర్వహించి నా సంగతి తెలిసిందే. అయితే కంగనా సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.